Mane Praveen

Apr 18 2024, 22:32

NLG: ఫుడ్ పాయిజన్ కు బలైన విద్యార్థి మరణాన్ని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి: దళిత రత్న బుర్రి వెంకన్న

భువనగిరి గురుకులాల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఇటీవల హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడి ప్రాణాలను కోల్పోయిన ఆరవ తరగతి విద్యార్థి ప్రశాంత్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి న్యాయం చేయాలని ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర కమిటీ పక్షాన ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న బుర్రి వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆయన మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలో కూలినాలి చేసుకుని జీవనం కొనసాగిస్తున్నటువంటి వారి పిల్లలే గురుకులాలలో విద్యను అభ్యసిస్తూ ఉంటారు. అటువంటి విద్యార్థులకు ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం, ఏ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయినా కూడా విద్యార్థులు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అట్టడుగు వర్గాల నుంచి బీద కుటుంబాలైనటువంటి వారి పిల్లలే ఈ హాస్టల్లో అధిక శాతం ఉంటారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే తమ పిల్లలను హాస్టల్లో ఉంచాలా లేకపోతే ఇంటికి తీసుకెళ్లాలా అని అయోమయ పరిస్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ, పూర్తిస్థాయిలో తెలంగాణ హైకోర్టు సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, చనిపోయిన చిన్న లచ్చి ప్రశాంత్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా ప్రశాంత్ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాలని, ప్రశాంత్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, మరణానికి కారణమైన సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని, ప్రభుత్వం రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ప్రక్షాళన చేయాలని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కమిటీ పక్షాన ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Mane Praveen

Apr 18 2024, 22:09

పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను గెలిపించండి: ధనుంజయ గౌడ్

చండూరు: పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి నియోజవర్గం నుండి సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. గురువారం నేర్మట గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. వీర తెలంగాణ సాయుధ రైతంగ పోరాటానికి కేంద్ర బిందువైన భువనగిరి నియోజకవర్గం నుండి పార్లమెంటులో ఎర్రజెండా ప్రాతినిథ్యం ఉండేలా చూడాలన్నారు. 

ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ నాయకులు ఈరటి వెంకన్న, నారపాక శంకరయ్య, బొమ్మరగోని యాదయ్య, బల్లెం స్వామి, బురుకల అంజయ్య గౌడ్, లక్ష్మమ్మ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 18 2024, 21:53

ఈనెల 21 న నల్గొండలో ఉమ్మడి జిల్లా పురుషుల ఫుట్బాల్ జట్టు ఎంపిక ప్రక్రియ

ఈనెల 27 నుండి 30 తేదీ వరకు కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో 10వ రాష్ట్రస్థాయి పురుషుల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించనున్నారు.

దానికి అనుగుణంగా ఈనెల 21వ తేదీ ఆదివారం నాడు నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఉమ్మడి నల్గొండ జిల్లా పురుషుల ఫుట్బాల్ జట్టు ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తున్నామని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, అధ్యక్షులు బండారు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు.

సెలక్షన్ ప్రక్రియలో పాల్గొనదలచిన ఉమ్మడి జిల్లాకు చెందిన ఫుట్బాల్ క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఒరిజినల్ ఆధార్ కార్డు మరియు జనన ధ్రువీకరణ (బర్త్ సర్టిఫికెట్) పత్రం తో హాజరుకావాలని, పూర్తి వివరాలకు 9492572900 సెల్ నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 18 2024, 20:28

ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్ బంపర్ ఆఫర్

దేశంలోని యువతను ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మం చేపట్టింది.

ఈ నేపథ్యంలో 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారు ఓటు వేసేందుకు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు విమాన టికెట్ల‌పై 19 శాతం రాయితీ ఇచ్చింది.

ఈ టికెట్ల‌ తో ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 మధ్య ప్ర‌యాణించే వెసులుబాటు కల్పించింది.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

Mane Praveen

Apr 18 2024, 21:06

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కుంభం కృష్ణారెడ్డి

నాంపల్లి: మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, గ్రామ మాజీ సర్పంచ్ కుంభం విజయ కృష్ణారెడ్డి బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి, అతని ముఖ్య కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీలోకి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం చేరారు.

అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలో వచ్చిన తదుపరి సంక్షేమ పథకాలను చూసి ఆకర్షతులై పార్టీలో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ లోకి కుంభం కృష్ణారెడ్డి ని సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో నాంపల్లి జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, నాంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య ఎరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, శీలం జగన్మోహన్ రెడ్డి, గజ్జల శివారెడ్డి, పానుగంటి వెంకన్న, తిప్పనీ ఎల్లారెడ్డి, కోరే కిషన్, పానుగంటి వెంకటయ్య, గౌరారం కృష్ణారెడ్డి, పంతు నాయక్, సుధాకర్ రెడ్డి, దీప్లా నాయక్, రవి నాయక్, ఈదశేఖర్, దేవత్ పల్లి యాదయ్య, కొండల్, నా రోజు సైదాచారి, కోరే శివ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 18 2024, 18:55

మునుగోడు: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మునుగోడు మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలలో చూపించిన జోష్ మరోసారి పునఃరావతం చేయాలని, భువనగిరి గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, వేముల వీరేశం, మందుల సామేల్, కుంభ అనిల్ కుమార్ రెడ్డి, జనగాం ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, డిసీసీ అధ్యక్షులు, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 17 2024, 19:17

NLG: శ్రీ రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు

నాంపల్లి: మండల కేంద్రములోని శ్రీ రాధా రుక్మిణి సమేత వేణుగోపాలస్వామి ఆలయం ఆవరణలో నిర్వహించిన శ్రీ రామనవమి వేడుకల సందర్భంగా, శ్రీ సీతారాములు స్వామి వారికి వేద పండితుల చేత ప్రత్యేక పూజలు గ్రామ పెద్దలు పూన్న పద్మ కోటయ్య, కోట ప్రమీల రఘునందన్, వీరమల్ల శ్వేత నాగరాజు, పెద్దిరెడ్డి అనిత అనంతరెడ్డి, మహేశ్వరం రవళి సంపూర్ణ చారి, వీరమల్ల విజయ లవ్వయ్య నిర్వహించారు.

అనంతరం శ్రీ రాధా రుక్మిణి సమేత వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ వారు.. గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులను శాలువాతో సత్కరించారు. కామీశెట్టి పాండు ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగింది. 

జిల్లా కాంగ్రెస్ నాయకులు గజ్జల శివారెడ్డి ఆలయానికి రూ. 1,20,000 లతో రంగులు వేయించగా పెద్దిరెడ్డి రాజు ఆలయానికి విరాళం అందించారు.ఈ కార్యక్రమంలో నక్క రవి, తిరుమని శేఖర్, నాంపల్లి చంద్రమౌళి, కోరేశివ, సింగారపు గిరి, కర్నాటి శ్రీహరి, అల్లంపల్లి ఆనంద్ కుమార్, తిరుమణి మోహన్, పెద్దిరెడ్డి జంగారెడ్డి, గౌరు కిరణ్, మోర సాయి, కామిశెట్టి చత్రపతి, కోరే మురళి, కామిశెట్టి యాదయ్య, గాదిపాక (కోతి) కృష్ణయ్య, కామిశెట్టి మల్లేష్, బెల్ది సత్తయ్య, మెడికల్ షాప్ కిరణ్, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Mane Praveen

Apr 17 2024, 18:11

NLG: రాములోరి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న నాంపల్లి జెడ్పిటిసి

నాంపల్లి: శ్రీరాముని ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలి అని జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం శ్రీ రామ నవమి సందర్భంగా పసునూరు గ్రామంలోని రామాలయంలో కళ్యాణ మహోత్సవంలో నాంపల్లి జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి రోజున ప్రతిఏటా వైభవోపేతంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటామని ఆయన అన్నారు. లోక కళ్యాణం కోసం ఎన్నోత్యాగాలను కోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనదని, రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదని తెలిపారు.

సీతారాముల ఆశీస్సులు ప్రజలకు ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని సీతారామచంద్రమూర్తులను ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు.

Mane Praveen

Apr 17 2024, 15:06

NLG: దేవాలయ నిర్మాణానికి మాజీ ఎంపీపీ విరాళం

 

మర్రిగూడెం మండలం వట్టిపల్లి గ్రామంలో ఏకశిల పై వెలిసిన శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి, మర్రిగూడ మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్ రూ. 50 వేలు విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ సిరిసవాడ బిక్షం, ఉపాధ్యక్షులు మల్గిరెడ్డి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కొంపల్లి నాగరాజు గౌడ్, కోశాధికారి ఎడ్ల కాశయ్య, కార్యవర్గ సభ్యులు సత్యనారి, రమేష్, సత్తయ్య, మల్లేష్ ఉన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 17 2024, 11:33

NLG: ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ: పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవ్వాల ఉదయం ఆకస్మికంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.రోగులకు అందుతున్న వైద్యసేవలు, ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.డాక్టర్ల హాజరు పట్టిక,ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషేంట్ల వివరాలను పరిశీలించారు.

హాస్పిటల్ లో లిఫ్ట్ పనిచేయకపోవడంపై సిబ్బందిని మంత్రి ప్రశ్నించగా..లిఫ్ట్ రిపేర్ అయ్యిందని..రిపేర్ చేయడానికి 10 రోజుల సమయం పడుతుందన్న సిబ్బంది సమాధానంపై మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ప్రసవం కోసం వచ్చే బాలింతలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని..బాలింతలు,పసిపాపలు ఉండే హాస్పిటల్ లో లిఫ్ట్ రిపేర్ కు పది రోజుల సమయం పడితే పేషేంట్ల పరిస్థితి ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..

అలాగే హాస్పిటల్ ఆవరణంలో పేషేంట్లు,వారి అటెండెంట్లు పడుతున్న ఇబ్బందులను చూసిన మంత్రి వెంటనే స్పందించి సకల సౌకర్యాలతో అందరికి అనువుగా ఉండేలా భవన నిర్మాణం చేయాలని,వైద్య ఆరోగ్యశాఖ, ఆర్అండ్ బీ అధికారులకు అప్పటికప్పుడే ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు.భవన నిర్మాణం నెలరోజుల్లోనే పూర్తిచేసేలా యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.తాను రెండు రోజులకు ఒకసారి భవన నిర్మాణ స్థితిగతులను పరిశీలిస్తానని అధికారులకు తెలిపారు.భవన నిర్మాణానికి కావాల్సిన అనుమతులను తాను ఇస్తానని చెప్పారు.హాస్పిటల్ మొత్తం కలియతిరిగిన మంత్రి..రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు.

పలుచోట్ల పారిశుద్య నిర్వాహణ లోపాలపై హాస్పిటల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ వస్తానని వచ్చే వరకు అన్ని సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు తేల్చిచెప్పారు.